తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జుట్టు ఊడిపోయిందన్న బాధతో ఆత్మహత్య.. డాక్టర్ ఇచ్చిన మందులే కారణమంటూ లేఖ - కేరళ ప్రశాంత్​ ఆత్మహత్య కేసు

ఓ యువకుడు జుట్టు రాలే సమస్యతో ఓ ప్రైవేట్​ క్లినిక్​కు వెళ్లాడు. ఆ డాక్టర్​ వద్ద కొన్ని సంవత్సరాల పాటు చికిత్స పొందాడు. అయినా ఫలితం లేకపోగా.. ఆ మందుల కారణంగానే తన కనుబొమ్మలపై జుట్టును సైతం కోల్పాయానని సూసైడ్​ నోట్​ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.

man died due to hair fall in Kerala
జుట్టు ఊడిపోయిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రశాంత్​

By

Published : Nov 9, 2022, 11:37 AM IST

ఓ యువకుడు తన జుట్టు ఊడిపోయిందన్న తీవ్ర మనస్తాపంతో.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్​ క్లినిక్​లో మందులు వాడినా సరే సమస్య తగ్గకపోగా.. కనుబొమ్మలపై జుట్టు సైతం ఊడిపోయింది. దీంతో ఆ యువకుడు అక్టోబర్​లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కేరళలోని ఉత్తర్​ కన్నూర్​కు చెందిన 26 ఏళ్ల ప్రశాంత్​ అనే వ్యక్తి.. 2014 నుంచి కొజికోడ్​లోని ఓ ప్రైవేట్​ క్లినిక్​లో జుట్టు రాలే సమస్యకు చికిత్స పొందాడు. అయితే.. ఆ డాక్టర్​ ఇచ్చిన మందుల కారణంగా తన తల సహా కనుబొమ్మలపై జుట్టును సైతం కోల్పోయినట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో మానసిక కుంగుబాటుకు లోనైన ప్రశాంత్​.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్టోబర్​ 1న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రశాంత్​ రాసిన సూసైడ్​ నోట్​లో.. తనకు వైద్యం వికటించడం​ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ప్రశాంత్ మృతికి కారణమైన డాక్టర్​పై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే.. ప్రశాంత్​కు సరైన వైద్యమే అందించానని.. అతడిది అరుదైన సమస్య అని ఆ డాక్టర్​ తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని స్థానిక ఎస్సై తెెలిపారు.

ABOUT THE AUTHOR

...view details