అర్ధరాత్రి.. యువకుడు విధ్వంసం కేరళ తిరువనంతపురంలో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. తంపనూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ఉంచిన 19 కార్లను ధ్వంసం చేశాడు.
ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ వాహనాలను తీసుకునేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు దీనిని గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది.
ఓ వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేసి.. అందులోని వస్తువులను తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. మధ్యాహ్నంలోగా ఆ 18 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతని మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు. చికిత్స తీసుకోకపోవడం వల్లే.. ఇలా జరిగిందని నిందితుడు కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించారు. అనంతరం అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి'