ప్రియురాలిని కాల్చి చంపి, ఆపై ప్రియుడూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయిలోని సబర్బన్ మలాద్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న బంగూర్ నగర్ పోలీసులు దర్యాప్తును చేపట్టారు.
రాహుల్ యాదవ్ అనే వ్యక్తి తన ప్రియురాలు నిధి మిశ్రాను ఓ బిల్డింగ్‌లో కాల్చి చంపినట్లు, తర్వాత అదే గన్‌తో అతను కాల్చుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మా దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వారిద్దరి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. వారి మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కేసు విషయమై మాకొక ప్రత్యక్ష సాక్ష్యం లభ్యమైంది.