Man Carrying Severed Hand With His Other Hand :బిహార్‌లో ఓ వ్యక్తి తన తెగిపోయిన చేతిని మరో చేత్తో పట్టుకుని హడావుడిగా వెళుతున్న సన్నివేశం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. భాగల్పుర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా.. కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. జరిగింది తెలుసుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు సుమన్ కుమార్. ఘర్ ఫులీ దుమార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆదివారం అర్థరాత్రి రైలు ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో అతని చేయి తెగిపోయింది. అనంతరం ఆ చేతిని మరో చేతితో పట్టుకుని ఆసుపత్రి కోసం వెతుకుతూ తిరిగాడు సుమన్ కుమార్. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి బాధితుడ్ని తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం భాగల్పుర్లోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తరలించారు.
మద్యం మత్తులో యువకుడు హల్చల్.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని..
Viral Video : కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై కూర్చుని ఓ యువకుడు హల్చల్ చేశాడు. మహారాష్ట్ర ఠాణెలో జరిగిందీ ఘటన. లోకో పైలట్ అప్రమత్తతతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.