తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భుజంపై చిన్నారి మృతదేహం.. అంబులెన్సు లేక బస్సులో ఇంటికి ప్రయాణం

నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్తున్న వీడియో ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతోంది. మృతదేహం తరలించేందుకు ఆస్పత్రి వద్ద ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడం వల్ల.. ఓ వ్యక్తి బస్సులో శవాన్ని తన ఊరికి వెళ్లాడు.

DEAD BODY ON SHOULDER
DEAD BODY ON SHOULDER

By

Published : Oct 20, 2022, 1:27 PM IST

కనీస సదుపాయాలు అందక పేదలు, మారుమూల ప్రాంత ప్రజలు హృదయవిదారక పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ బస్టాండ్‌ వరకూ వెళ్లాడు. తన ఊరు చేరుకోవడానికి ఇతర ప్రయాణికుల మాదిరిగానే బస్సులో ప్రయాణించాడు. మృతదేహంతోపాటుగా అతడు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దాంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛతర్‌పుర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. కానీ, తిరిగివచ్చే సమయంలో చిన్నారి సమీపబంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వద్ద ఎటువంటి వాహనం అందుబాటులో లేదు. మరోపక్క ప్రైవేటు వాహనంలో ఊరు వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేవు. దాంతో చిన్నారి మృతదేహాన్ని భుజం మీదే మోసుకుంటూ బస్టాండ్ వద్దకు వెళ్లాడు. అందరి ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్‌ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తోటి ప్రయాణికుడొకరు సహాయం చేశారు. కొద్దినెలల క్రితం అదే ఆస్పత్రికి వచ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఛతర్‌పుర్ ప్రాంతంలో అత్యవసర సదుపాయాల అందుబాటుపై ప్రశ్నలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details