Man Burnt Alive In Tirupati : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో శనివారం అర్ధరాత్రి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో ఓ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు... మంటలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నపోలీసులు.. కారులో వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు సజీవ దహనమైనట్లు గుర్తించారు. మృతుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల క్లూస్ టీం వివరాలు సేకరించింది.
నాగరాజు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడ్ని అన్యాయంగా చంపేశారని ఆయన తండ్రి జయ రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన మరిదికి, ఓ వ్యక్తి భార్యకు ఉన్న సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు నాగరాజు భార్య సులోచన ఆరోపించారు. గొడవులు లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న తన భర్తను చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
"నా మరిది.. బట్టే రూపంజయ్య వాళ్ల వైఫ్‌కు రెండు నెలల నుంచి రిలేషన్ షిప్లో ఉన్నారు. రూపంజయ్యకు తెలిసి ఎప్పటి నుంచే హత్య చేయాలని చూస్తున్నాడు. పురుషోత్తంని చంపాలని చూశారు. దీంతో నాగరాజు తమ్ముడిని బెంగుళూరుకు పంపిచేశాడు. కాంప్రమైజ్ కోసం నాగరాజు ప్రతి వారం వెళ్లి వస్తున్నాడు. మాకు ఫోన్లుచేసి మిమల్ని ఎలాగైనా చంపేస్తాను అని బెదిరించాడు. పలు రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాడు. మేము ఫైన్ కట్టాము. గోపి అనే అతను ఫోన్ చేశాడు. బట్టే రూపంజయ్య.. నా భర్తను కలుపుతానని.. కాంప్రమైజ్ చేస్తానని అన్నాడు. కాంప్రమైజ్ కోసం తిరుపతి వస్తున్నానని, వాళ్లు ఇంకా రాలేదు. వాళ్లు వస్తారని చెప్పారు. నేను ఫోన్ చేసినపుడు అదే చెప్పాడు. వెంటనే కాల్ కట్ అయిపోయింది. ఫోన్ స్విచ్చాఫ్ అయింది. వాళ్ల ఫ్రెండ్స్ 12:30 కాల్ చేసి మీ కారు కాలిపోతుందని అని చెప్పారు." - మృతుడి భార్య