Man burns wife: దంపతుల మధ్య జరిగిన గొడవ.. భార్య ప్రాణం పోయేలా చేసింది. మద్యం మత్తులో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలోని ఫటాతంగర్ గ్రామంలో మంగళవారం జరిగింది. రఘరాజ్ రాణా, లిలిమా భార్యాభర్తలు. రఘురాజ్ సాయంత్రం మద్యం సేవించడం వల్ల వీరి మధ్య గొడవ తలెత్తింది. దీంతో లిలిమా కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్యపై కిరోసిన్ పోసి సజీవదహనం.. ఆ కారణంతో! - లిలిమా రానా
Man burns wife: మద్యం మత్తులో భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. ఈ ఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో జరిగింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
సోమవారం రాత్రి 11గంటల సమయంలో రఘరాజ్ తన అత్తవారింటికి వెళ్లి భార్యను తనతో పంపమని కోరాడు. అంగీకరించిన లిలిమా తండ్రి ఆమెను ఒప్పించి భర్త వెంట పంపాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న రఘురాజ్.. తన భార్యపై కోపంతో గదిలోకి తీసుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు లిలిమాను పక్కింటివారు కూచింద సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. మృతురాలు లిలిమా సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రఘురాజ్ను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:చికిత్స చేస్తుండగా గర్భిణీ మృతి.. డాక్టర్ ఆత్మహత్య.. పెల్లుబికిన ఆగ్రహం