తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యపై ప్రేమతో ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిన భర్త, కానీ చివరకు - భార్య సమాధి పక్కనే భర్త అంత్యక్రియలు

భార్యను ఎంతో ప్రేమించాడు. అకస్మాత్తుగా ఆమె మరణించడం వల్ల తట్టుకోలేకపోయాడు. ఇంట్లో ఆమె లేని క్షణాన్ని ఊహించుకోలేకపోయాడేమో మరి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు తమిళనాడులో చనిపోయిన ఓ విశ్రాంత సైనికుడి మృతదేహాన్ని అతడి భార్య సమాధి పక్కనే పూడ్చారు కుమారులు. తన తండ్రి చివరి కోరిక మేరకే ఇలా చేశామని చెబుతున్నారు. ​

Man Buried Dead Wife In Floor Of House:
Man Buried Dead Wife In FlooMan Buried Dead Wife In Floor Of House:r Of House:

By

Published : Aug 26, 2022, 1:20 PM IST

భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిన భర్త

Man Buried Dead Wife In Floor Of House: భార్యపై ప్రేమతో ప్రతి ఒక్క భర్త.. రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు ఇష్టమైన వస్తువులు కొనిస్తే మరికొందరు ఎప్పటికీ మరిచిపోని గుర్తులు ఇచ్చి తమ ప్రేమను చూపిస్తారు. కానీ మధ్యప్రదేశ్​లోని డిండౌరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. తన భార్యపై ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

డిండౌరీలోని వార్డ్​ నంబర్​ 14లో నివాసం ఉంటున్న ఓంకార్​ దాస్​.. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి 25 ఏళ్ల క్రితం రుక్మిణి అనే మహిళతో వివాహమైంది కానీ సంతానం కలగలేదు. వివాహం జరిగినప్పటి నుంచి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించారు. అయితే రుక్మణి అనారోగ్యంతో మంగళవారం(ఆగస్టు 23) మృతిచెందింది. ఆ బాధను తట్టుకోలేక ఓంకార్​ దాస్..​ భార్యపై ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిన భర్త

అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల స్థానిక ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఘటనపై ఎస్డీఎం బల్వీర్ రామన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్డీఎం ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ గోవింద్రం సలామే బుధవారం సాయంత్రం పోలీసులతో కలిసి ఉపాధ్యాయుడి ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు.

భార్య సమాధి పక్కనే భర్త మృతదేహం ఖననం..
తమిళనాడులోని తిరువణ్నామలై జిల్లాలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని అతడి భార్య సమాధి పక్కనే పూడ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు బంధువులు. అయితే తన తండ్రి చివరి కోరిక తీర్చడానికి ఇలా చేశామని కుమారులు చెబుతున్నారు.

శారదమ్మాల్​ సమాధి పక్కన కుప్పన్​ మృతదేహం ఖననం

అసలేం జరిగిందంటే.. జిల్లాలోని వన్నంకులం గ్రామానికి ఎంసీ కుప్పన్​ (98).. సైన్యంలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. అతడి భార్య శారదమ్మాల్​ 1998లో మరణించింది. ఆ సమయంలో గ్రామ శివార్లలో 52 సెంట్ల స్థలం కొనుగోలు చేసి భార్య సమాధిని నిర్మించారాయన. అయితే తాను చనిపోతే శారదమ్మాల్​ సమాధి పక్కనే ఖననం చేయాలని కుమారులకు చెప్పారు. అందుకు అవసరమైన స్థలాన్ని అప్పుడే తవ్వించారు. వయో సంబంధిత సమస్యలతో కుప్పన్​ ఆగస్టు 18న మరణించారు. కుప్పన్​ మృతదేహాన్ని తన భార్య శారదమ్మాల్​ సమాధి పక్కనే పూడ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు అతడి బంధువులు.

ఇవీ చదవండి:ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు లభ్యం, ఏం జరిగింది

పెట్రోల్​ బంక్​లో పట్టపగలే దారుణం, మహిళపై కత్తితో దాడి, వెంటాడి మరీ

ABOUT THE AUTHOR

...view details