తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2021, 10:35 AM IST

ETV Bharat / bharat

గర్ల్​ఫ్రెండ్స్ కోసం వజ్రాలు, ఖరీదైన కార్ల చోరీ.. చివరకు!

10మంది గర్ల్​ఫ్రెండ్స్ ఉన్న ఓ వ్యక్తి.. వారి కోరికలను తీర్చేందుకు భారీ దొంగతనాలకు(Ghaziabad Crime News)పాల్పడ్డాడు. వజ్రాభరణాలు, రత్నాలు, ఖరీదైన కార్లను చోరీ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

Man arrested for thieving people to fulfil girlfriends dreams
గర్ల్​ఫ్రెండ్స్ కోసం దొంగతనం

గర్ల్​ఫ్రెండ్స్ అడిగినవి ఇచ్చేందుకు దొంగతనాలకు పాల్పడిన ఓ వ్యక్తిని ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్ (Ghaziabad Crime News) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఇర్ఫాన్ అలియాస్ ఉజాలాగా గుర్తించారు. రూ. కోటి విలువ చేసే జాగ్వార్ కారును ఇర్ఫాన్ ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే పెళ్లైన ఈ వ్యక్తికి.. పది మంది గర్ల్​ఫ్రెండ్స్ ఉన్నారని పోలీసులు చెప్పడం గమనార్హం.

నిందితుడు ఇర్ఫాన్

దొంగతనం అంటే సాదాసీదాగా చేయలేదు ఇర్ఫాన్. ఇతడు దొంగతనం చేసిన వస్తువుల విలువ కోట్లలో ఉందని పోలీసులు గుర్తించారు. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. జాగ్వార్ కారుతో పాటు మరో వాహనాన్ని సీజ్ చేశారు. వజ్రాల ఆభరణాలు, రత్నాలనూ స్వాధీనం చేసుకున్నారు. గోవా గవర్నర్, న్యాయమూర్తి నివాసాలకు పక్కన ఉండే ఇళ్లలోనూ చోరీలు చేశాడు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు
ఖరీదైన కారు

ఒక్కడే వెళ్లి..

దొంగతనాలు చేసేందుకు (Ghaziabad Robbery News) ఒక్కడే వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. విలాసవంతమైన కార్లలో దొంగలించిన సొత్తును తీసుకెళ్లేవాడని వెల్లడించారు. ఆభరణాలు, వాహనాలపై ఇతడికి అపారజ్ఞానం ఉందని చెప్పారు. నకిలీ ఆభరణాలను ఇట్టే గుర్తుపట్టేవాడని, వాటిని అస్సలు ముట్టుకోడని వివరించారు. దొంగతనం చేసిన విలాసవంతమైన కార్ల భాగాలను వేరు చేసి విక్రయించేవాడని తెలిపారు.

"నిందితుడు తన నేరాలను ఒప్పుకున్నాడు. గోవా, తమిళనాడు, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్, హరియాణా, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. మొత్తం 25 కేసులతో ఇతడికి సంబంధం ఉంది. అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశాం" అని పోలీసులు వివరించారు.

అంతకుముందు, ఇర్ఫాన్ భార్య, ఓ గర్ల్​ఫ్రెండ్​ను సైతం అరెస్టు చేశారు పోలీసులు. దొంగతనాల్లో ఇర్ఫాన్​కు సహకరిస్తున్నారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details