ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో దళిత బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలిక తండ్రి పనిచేసే ఇటుక బట్టీ యజమానికి దగ్గరి బంధువైన నిందితుడు.. హోలీ రోజు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
హోలీ రోజు బాలికను ఇటుక బట్టీ ప్రాంగణంలోని కార్యాలయానికి పిలిచి నిందితుడు అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇటుక బట్టీ యజమానిని ప్రశ్నించగా వారు అతనిపై దాడి చేశారని, పోలీసులకు చెప్పొద్దని బెదిరించారని అన్నారు. దీంతో బాలిక తండ్రి కార్మిక నాయకులను సంప్రదించగా.. అతను ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. మథురకు చెందిన నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న అతన్ని శనివారం అరెస్టు చేసినట్లు సీనియర్ ఎస్పీ కళానిధి నైతాని స్పష్టం చేశారు.
మహిళా నేతపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక దాడి!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు తనను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యూత్ కాంగ్రెస్ మహిళా నేత ఆరోపించారు. దీంతో ఆయనపై ఇందోర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు.