తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో ఘోరం.. 72ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం - ఉత్తర్​ప్రదేశ్ రేప్ కేసు

ఉత్తర్​ప్రదేశ్​లో పైశాచిక ఘటన వెలుగుచూసింది. 72ఏళ్ల వృద్ధురాలినీ వదల్లేదు ఓ కామాంధుడు. పని ఇప్పిస్తానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

RAPE
రేప్

By

Published : Nov 17, 2021, 1:09 PM IST

మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర్​ప్రదేశ్​​లో వెలుగుచూసింది. 72ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో వికాస్ శర్మ అనే 52ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

పని ఆశ చూపి..

సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 72ఏళ్ల మహిళ నవంబర్ 14 సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బోడ్లా అనే ఊరికి వెళ్లింది. అయితే ఆమెను ఓ వ్యక్తి.. పని ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. నిందితుని మాటలు నమ్మిన వృద్ధురాలు అతనితో పాటు వెళ్లిందని అని పోలీసులు తెలిపారు. అయితే 'తనను పెళ్లికి కాకుండా.. ఓ ఇంట్లో బందీగా చేసి అత్యాచారానికి పాల్పడ్డినట్లు ఆమె వాపోయింద'ని వివరించారు.

'అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. సోమవారం ఉదయం మాకు సమాచారం అందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం' అని ఎస్​ఐ ప్రవీంద్ర కుమార్ సింగ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details