తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాస్ట్​లీ కార్లలో తిరుగుతూ మహిళలకు టోకరా.. 100 మందిని నమ్మించి! - దిల్లీ న్యూస్​

Man Arrested For Cheating Delhi: ఖరీదైన కార్లలో తిరుగుతూ.. పెద్ద వ్యాపారం చేస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానంటూ మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వందకుపైగా మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్​ ఫోన్​, నాలుగు సిమ్​కార్డ్స్​, తొమ్మిది ఏటీఎమ్​ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Man Arrested For Cheating 100 Womens
Man Arrested For Cheating 100 Womens

By

Published : May 14, 2022, 8:51 AM IST

Man Arrested For Cheating 100 Womens: పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. వందకు పైగా మహిళలను మోసం చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. దిల్లీ పహాడ్​గంజ్​కు చెందిన ఫర్హాన్​ తసీర్​ ఖాన్​ ప్రస్తుతం ఒడిశాలో నివసిస్తున్నాడు. ఇతడు అనేక మంది మహిళలను పెళ్లి పేరుతో బురిడీ కొట్టించాడు. దిల్లీ ఎయిమ్స్​లో పనిచేసే వైద్యురాలిని మ్యాట్రిమోని సైట్​లో కలిశాడు. తాను ఓ అనాథనని.. ఏంబీఏ పూర్తిచేసి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నానని నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఫర్హాన్​.. వ్యాపారాన్ని విస్తరిస్తానని ఆమె వద్ద రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఫర్హాన్​ మోసాన్ని గుర్తించిన వైద్యురాలు పోలీసుల్ని సంప్రదించింది.

విచారణలో అనేక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇతడు నకీలీ ఖాతాలు సృష్టించి.. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది మహిళల్ని పెళ్లి పేరుతో మోసం చేసినట్లు తేలింది. అమ్మాయిలను నమ్మించడానికి బంధువులకు చెందిన వీవీఐపీ రిజిస్ట్రేషన్​ గల ఖరీదైన కారులో తిరిగేవాడు. గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు అతడిని పహాడ్​​గంజ్​లో పట్టుకున్నారు. ఫర్హాన్​కు మూడేళ్ల కూతురితో పాటు తండ్రి, సోదరి ఉన్నారు. నిందితుడి వద్ద మొబైల్​ ఫోన్​, నాలుగు సిమ్​కార్డ్స్​, తొమ్మిది ఏటీఎమ్​ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:శాలరీ నిలిపివేసిన హెడ్​మాస్టర్​పై హైకోర్టు గరం.. నెలరోజులు సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details