పెళ్లి చేసుకుంటానని నమ్మించి తైవాన్‌కు చెందిన 53 ఏళ్ల మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హరియాణా గురుగ్రామ్‌లోని సెక్టార్ 53 పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితుడు విశ్వకర్మ(29)ను అరెస్టు చేశారు. సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:2017 నుంచి తైవాన్ మహిళ గురుగ్రామ్‌లో ఉంటోంది. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. బాధితురాలికి ఆరు నెలల క్రితం నిందితుడు విశ్వకర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పెళ్లి చేసుకోమని అడగడం వల్ల ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో బాధితురాలు సెక్టార్ 53 పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు విశ్వకర్శ మధ్యప్రదేశ్‌కు చెందినవాడు. అతడు ప్రైవేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు.