కర్ణాటక హుబ్బళ్లిలోని గోవీ ఓనికి చెందిన ఓ యువకుడు.. నడవలేని వీధి శునకానికి సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. ఓ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన జాగిలానికి వీల్ ఛైర్‌ను తయారు చేసి.. మళ్లీ నడిచేలా చేశాడు నవీన్ చరంతిమత్.
యూట్యూబ్ చూసి..
కొన్ని రోజుల క్రితం ప్రమాదానికి గురైన ఓ శునకాన్ని చూశాడు నవీన్. ఆ కుక్క దీన స్థితికి చలించిపోయిన.. సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కాళ్లు బాగు చేయడం కుదరదని చెప్పారు వైద్యులు. అయితే ఆ శునకాన్ని ఎలా అయినా మళ్లీ నడిచేలా చేయలనుకున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసిన నవీన్.. తన స్నేహితుల సాయంతో వీల్ ఛైర్ తయారు చేశాడు.