తన దశ దిన కర్మకు తానే అతిథిగా వచ్చి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చాడు బంగాల్ భీరతి ప్రాంతానికి చెందిన శివనాథ్ బెనర్జీ. అనారోగ్యం కారణంగా ఈ నెల 11న స్థానికంగా ఉండే జీఎన్‌ఆర్‌సీ ఆసుపత్రిలో బెనర్జీని కుటుంబ సభ్యులు చేర్పించారు. రెండు రోజులు తరువాత అతను మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి బంధువులకు అప్పగించారు. వారందరూ లబోదిబోమని కన్నీరు మున్నీరుగా విలపించారు. అదే రోజు దహన సంస్కారాలు నిర్వహించారు.
తన దిన కర్మకు తానే అతిథిగా! - bengal crime news
ఆ వ్యక్తి చనిపోయాడు. ఇదే విషయం ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాలు కూడా కానిచ్చేశారు. ఇంక మిగిలింది దశదిన కర్మలు మాత్రమే. రేపు జరుగుతాయి అనగా చనిపోయిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎలా వచ్చాడు అంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
![తన దిన కర్మకు తానే అతిథిగా! man aged 75 returned home after being declared officially dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9622528-781-9622528-1606014546263.jpg)
తన శాంతి కర్మలకు తానే అతిథిగా వచ్చారు
అయితే రేపు దశదిన కర్మ అనగా.. అదే ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌కాల్ వచ్చింది. 'మీరు ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నారు. వచ్చి తీసుకొనిపోవచ్చు' అని అన్నారు. ఆశ్చర్యానికి గురైన బెనర్జీ బంధువులు ఆసుపత్రికి వెళ్లారు. ఎవరిదో మృతదేహాన్ని వీరికి అప్పగించారని తెలిసి విస్తుపోయారు.
ఇదీ చూడండి: ఆశ్చర్యపరిచే ఆహ్వానం- 112 పేజీలతో ప్రత్యేక శుభలేఖ