Accused Released After 12 Years: దేశ న్యాయవ్యవస్థలో లోపం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపే మరో ఘటన ఉత్తరప్రదేశ్లోని బాందాలో జరిగింది. చేయని నేరానికి జైలుకెళ్లిన నిందితుడు.. తన జీవితంలో విలువైన సమయాన్ని కారాగారంలోనే గడిపాడు. హత్యాచార ఆరోపణలపై కటకటాల వెనక జీవితం గడిపిన మహమ్మద్ కమ్రుజామా ఖాన్ అనే వ్యక్తిని.. 12 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. అతడు దోషి అని నిరూపించేలా పోలీసులు తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయారు.
అసలేమైందంటే..? 2010 జులై 28న.. ఉత్తరప్రదేశ్లోని బాందా ప్రాంతంలో ఓ దళిత మహిళపై హత్యాచారం జరిగింది. ఆ తర్వాత రోజు.. బాబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొలంలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన తర్వాత బాధితురాలి భర్త అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సింగ్ను అనుమానిస్తూ అరెస్టు చేసి అదే సంవత్సరం జైలుకు పంపారు పోలీసులు. 12 ఏళ్ల తర్వాత సింగ్ నిర్దోషిగా తేలాడు.