ఉత్తర్ప్రదేశ్లో సరికొత్త రాజకీయ సమీకరణం తెరమీదకు రానున్నట్లు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీతో టీఎంసీ జట్టు కట్టనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఛఠ్ పూజ తర్వాత బంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీలో పర్యటించనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో సమాజ్వాదీ పార్టీ అధికారికంగా పొత్తు గురించి ప్రకటన చేయనుందని సమాచారం. ఇప్పటికే టీఎంసీ అధినేత్రితో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ టచ్లో ఉన్నారన్నది సంబంధిత వర్గాల మాట. ఫోన్లో దీదీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
సంప్రదింపులే కాకుండా.. ఎన్నికల్లోనూ దీదీ వ్యూహాన్నే అఖిలేశ్ (UP Election Akhilesh Yadav) పాటిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు (UP Election 2022) జరగనుండగా.. పార్టీని పూర్తిగా సన్నద్ధం చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. ఓటర్లను చేరుకొని పార్టీ తరపున ప్రచారం చేయడం వీరి ప్రధాన లక్ష్యం. బంగాల్లో మమత సైతం ఇదే విధంగా జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసి సఫలమయ్యారు.
ఖేలా హోబె!