తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గెలుపు కోసం భాజపా నేత సాయం కోరిన దీదీ!

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్​లో తన గెలుపు కోసం స్థానిక భాజపా నేత సాయం కోరినట్లు ఉన్న ఆడియో టేప్​ను ఆ రాష్ట్ర కమలం నేతలు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో టేపు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీదీకి ఓటమి భయం పట్టుకుందని కమనాథులు విమర్శిస్తే... తృణమూల్​ మాత్రం వాటిని కొట్టి పారేసింది.

Mamata's purported audio clip seeking help from BJP leader to win Nandigram stirs row in Bengal
గెలుపుకోసం స్థానిక నేత సాయం కోరిన దీదీ!

By

Published : Mar 27, 2021, 6:15 PM IST

ఓ వైపు బంగాల్​లో తొలి దశ పోలింగ్​ జరుగుతుండగా... భాజపా నాయకులు విడుదల చేసిన ఆడియో క్లిప్​ ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్​లో తన గెలుపు కోసం స్థానిక భాజపా నేత సాయం కోరినట్లు అందులో ఉండటం ఇందుకు కారణం. దీన్ని ఆసరాగా చేసుకుని కమలదళం తృణమూల్​ అధినేత్రిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఆడియో వైరల్​గా మారింది.

ఈ విషయంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయ, ఇతర నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఆడియో టెప్​ను అందజేశారు. మమత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై అధికార తృణమూల్​ కాంగ్రెస్​ మండిపడింది. మమత మాట్లాడిన ప్రలే పాల్​ అనే వ్యక్తి తమ పార్టీ నుంచి భాజపాలో చేరారని.. ఆయన్ని వెనక్కి పిలవడంలో తప్పేంముందని కమలదళాన్ని ప్రశ్నించింది. అనవసర ఆరోపణలను మానుకోవాలని హితవు పలికింది.

ఫోన్​లో ఏమన్నారు?

తాను ఇప్పటికీ సువేందు అధికారి కుటుంబానికి విధేయుడినని ప్రలే పాల్​ తెలిపారు. నందిగ్రామ్ స్థానం నుంచి గెలిచేందుకు మమత తన సాయం కోరినట్లు ఆయన తెలిపారు.

"నందిగ్రామ్ గెలవడానికి మీరు మాకు సహాయం చేయాలి. మీకు ఏవో మనస్పర్ధాలు ఉన్నాయని నాకు తెలుసు. అధికారి ఉన్న కారణంగా నందిగ్రామ్​లో నేను రాలేకపోయాను. ఇకనుంచి నేనే దగ్గరుండి అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటాను," అని ఫోన్​లో మమత చెప్పినట్టు ప్రలే పాల్​ వెల్లడించారు.

ఏప్రిల్​ 1న జరగనున్న ఈ ఎన్నికల్లో నందిగ్రామ్​ నియోజకవర్గం నుంచి స్వయంగా దీదీ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా తృణమూల్​ నుంచి బయటకు వచ్చిన సువేంధు అధికారి.. భాజపా నుంచి రంగంలోకి దిగుతున్నారు.

'మమతకు ఇప్పుడు అర్థమైంది..'

ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని భాజపా నేత శిశిర్​ భజోరియా ఆరోపించారు. అందుకే నందిగ్రామ్ జిల్లా భాజపా వైస్ ప్రెసిడెంట్​కు ఫోన్​ చేసి సహాయం కోరారని తెలిపారు. పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా ఇదే కారణమని పేర్కొన్నారు. ​

ఇదీ చూడండి:'ఓట్ల కోసమే మోదీ బంగ్లాదేశ్​ పర్యటన'

ABOUT THE AUTHOR

...view details