తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం? - suvendu nandigram mamata banerjee

బంగాల్ రాజకీయం నందిగ్రామ్​ నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు తనకు కుడి భుజంగా ఉన్న సువేందు సీటుపైనే గురిపెడుతూ.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించడం చర్చకు తెరలేపింది. మరి దీదీ వ్యూహానికి సువేందు చిక్కుతారా లేదా.. తాను తీసుకున్న గొయ్యిలో దీదీ పడిపోతారా? దీనిపై రాజకీయ పండితులు ఏమంటున్నారు?

Mamata's decision to contest from Nandigram: A masterstroke or Waterloo?
దీదీxసువేందు: 'నందిగ్రామ్' వ్యూహం.. ఎవరికి లాభం?

By

Published : Jan 19, 2021, 5:01 PM IST

బంగాల్​లో ఆధిపత్య ప్రదర్శనకు నందిగ్రామ్ నియోజకవర్గం వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరానికి కేంద్ర బిందువుగా మారింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం.. కొత్త చర్చకు దారితీసింది. తృణమూల్ నుంచి వైదొలిగి భాజపాలో చేరిన సువేందు అధికారిని ఓడించడమే లక్ష్యంగా దీదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని సువేందు అదే రోజు సవాలు విసరగా.. రాష్ట్ర రాజకీయం రసవత్తర ఘట్టానికి చేరింది.

ప్రస్తుతం బంగాల్ రాజకీయాల్లో చర్చంతా ప్రధానంగా ఈ అంశంపైనే నడుస్తోంది. దీదీ తీసుకున్న నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అవుతుందా? తిరగబడుతుందా అనే విశ్లేషణలపైకి ప్రజల దృష్టి మళ్లింది.

ఇద్దరికీ సమానంగా..

నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలన్న మమతా బెనర్జీ నిర్ణయానికి అనుకూల ప్రతికూల అంశాలు రెండూ ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. దీదీకి ఉన్న ప్రతికూల అంశాలు సువేందుకు అనుకూలంగా, సువేందుకు ప్రతికూలంగా ఉన్న విషయాలు దీదీకి ప్రయోజనకరంగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

టీఎంసీని వీడి భాజపాలో చేరినందున సువేందుకు నందిగ్రామ్ నుంచే పోటీ చేసి తన గెలుపును నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 'ఇక్కడి గడ్డపైనే పుట్టి పెరిగాను' అని తనను తాను స్థానిక వ్యక్తిగా అభివర్ణించుకుంటారు సువేందు. కాబట్టి, ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా ప్రజలు తన పట్ల విశ్వాసంగానే ఉన్నారని తెలియజెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీదీ చేసిన ప్రకటనతో సువేందు తన ప్రకటనను నిజం చేసుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది.

రెండోది...

నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని దీదీ నిర్ణయం తీసుకోకపోతే.. సువేందు ఇక్కడ సులభంగానే విజయం సాధించే అవకాశం ఉండేది. కానీ, మమత ప్రకటనతో పోటీ అంతా.. 'ఇక్కడి గడ్డ మీద పుట్టిన బిడ్డ'కు, బంగాల్ రాజకీయ ముఖచిత్రంగా మారిన మమతకు అన్నట్లు మారిపోయింది. కాబట్టి సువేందు విజయం సాధించడం తేలికేం కాదని స్పష్టమవుతోంది.

అదే సమయంలో దీదీ తీసుకున్న నిర్ణయం తనకు కూడా ప్రతికూలతలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీ అధినేత్రి స్వయంగా రంగంలోకి దిగడం.. భాజపాను పక్కనబెట్టి సువేందునే తన ప్రధాన ప్రత్యర్థిగా దీదీ భావిస్తున్న విషయాన్ని సూచిస్తోందని అంటున్నారు. అంతేకాకుండా, తన ప్రచార సమయాన్ని మొత్తం నందిగ్రామ్​కే కేటాయించే పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు.

"ఒకవేళ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని మమతా బెనర్జీ నిర్ణయం తీసుకుంటే.. తన దృష్టిని ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం(భవానీపుర్) నుంచి మళ్లించాలి. నందిగ్రామ్, భవానీపుర్​ను సమన్వయం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇతర నేతల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించేందుకు సమయం ఉండదు. గతంలో బంగాల్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది" అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

2011 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆ సమయంలో సొంత నియోజకవర్గమైన జాదవ్​పుర్​పై ఆయన అధికంగా దృష్టిసారించారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ నేత మనీష్ గుప్తా చేతిలో ఓడిపోయారు.

ఈ పరిస్థితుల్లో దీదీ వర్సెస్ సువేందుగా మారిన బంగాల్ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. చివరకు ఇందులో విజయం సాధించేది ఎవరో కాలమే నిర్ణయిస్తుంది.

ఇవీ చదవండి:

'దసరా స్కెచ్'తో బంగాల్​ పీఠంపై భాజపా గురి

టీఎంసీలో అసమ్మతి సెగ- భాజపాకు లాభించేనా?

బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​

బంగాల్​ దంగల్​: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!

బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?

మళ్లీ తెరపైకి 'మిస్టరీ'- మోదీ, దీదీ మధ్యలో 'నేతాజీ'

బంగాల్​ గడ్డ మీద తృణమూల్​కు భాజపా 'సవాల్​'

ABOUT THE AUTHOR

...view details