తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​కు ఆక్సిజన్ సరఫరా పెంచండి' - బంగాల్

బంగాల్​కు రోజుకు 550మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ను సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. అంతకంటే తక్కువ ఆక్సిజన్​ పంపిస్తే రాష్ట్రంలో కరోనా రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు మమత.

MAMATA
మమతా బెనర్జీ

By

Published : May 7, 2021, 3:21 PM IST

బంగాల్​కు మెడికల్ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్​ సరఫరాను పెంచారని.. కానీ తమ రాష్ట్రానికి సరిపడినంత పెంచలేదని మమత ఆరోపించారు.

రాష్ట్రంలో రోజుకు 550మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని అయితే కేంద్రం కేవలం 308 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్ పంపిస్తోందని అన్నారు. 24గంటల్లో బంగాల్​కు 470మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ అవసరమైందని.. మరో వారంలో అది రోజుకు 550మెట్రిక్​ టన్నులకు చేరుతుందని తెలిపారు. రోజుకు 550మెట్రిక్​ టన్నుల కంటే తక్కువ ఆక్సిజన్​ పంపిస్తే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారుతాయని.. కరోనా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు మమత.

ఇదీ చదవండి:బంగాల్ గవర్నర్​ను కలిసిన కేంద్ర బృందం

ABOUT THE AUTHOR

...view details