పెగాసస్ గూఢచర్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇది అమెరికా వాటర్‌గేట్ కుంభకోణం కంటే దారుణమైందని వ్యాఖ్యానించారు. అన్ని నిష్పాక్షిక సంస్థలను భాజపా ప్రభుత్వం రాజకీయం చేసిందని దీదీ ఆరోపించారు.
"పెగాసస్.. వాటర్‌గేట్ కుంభకోణం కంటే ఘోరంగా ఉంది. ఇది సూపర్ ఎమర్జెన్సీ. భాజపా తన సొంత మంత్రులు, అధికారులను కూడా నమ్మడం లేదు. ఆర్ఎస్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు విన్నాను." అని దీదీ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతరులపై ఈ స్పైవేర్ సాయంతో ప్రభుత్వ సంస్థలు నిఘా పెట్టాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.