బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 'అసహనానికి పర్యాయపదం మమత' అని వ్యాఖ్యానించారు. బంగాల్ సహా భాజపాయేతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లో రాచరిక పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా సీట్లను సంపాదించి బంగాల్లో భాజపా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు నడ్డా. రైతులు ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో భాజపా విజయభేరి మోగించిందన్నారు. మోదీ సర్కారు, ఆయన విధానాలకు అనుకూలంగా ఆ రాష్ట్ర రైతులు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.