అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగినా, ఎన్నికల్లో భాజపాపై విజయదుందుభి మోగించినా.. బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ.. ప్రముఖ నేతలకు మామిడి పండ్లు పంపించడం మరిచిపోలేదు. ప్రతి ఏడాది పంపినట్లే ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. బంగాల్ మామిడి పండ్లు పంపించారు. హిమసాగర్, మాల్డా, లక్ష్మణ్‌భోగ్ వంటి ప్రత్యేక రకాల మామిడి పండ్లను మోదీకి పంపారు దీదీ.
మోదీకి మామిడి పండ్లు పంపిన సీఎం - ప్రధాని మోదీ న్యూస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మామిడి పండ్లు పంపారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. మోదీతో పాటు అమిత్ షా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు నేతలకు మామిడి పండ్లు బహుమతిగా పంపారు.
నరేంద్ర మోదీ, ప్రధాని మోదీ
ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలకు మామిడి పండ్లను బహుమతిగా పంపారు
ఇదీ చదవండి:విద్యార్థులకు రూ.10లక్షల రుణం!
Last Updated : Jul 1, 2021, 7:31 PM IST