బంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటర్లను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. పేద ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించే 'మా' పథకాన్ని సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఈ పథకం కింద కేవలం రూ.5కే ప్లేట్ భోజనం అందిస్తామని ఆమె తెలిపారు.
బంగాల్లో 'మా' క్యాంటీన్- రూ.5కే భోజనం - West Bengal Chief Minister Mamata Banerjee
బంగాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు మరో పథకాన్ని తీసుకొచ్చింది దీదీ సర్కార్. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో 'మా' క్యాంటీన్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్యాంటీన్లో ఐదు రూపాయలకే ప్లేట్ భోజనం లభిస్తుందని ఆమె తెలిపారు.

మా క్యాంటీన్లో రూ.5కే భోజనం
'మా' పథకం ద్వారా అందించే భోజనంలో.. అన్నం, పప్పు, ఒక రకం కూరగాయతో పాటు.. గుడ్డు కూర కూడా ఉంటుందని దీదీ తెలిపారు. ఒక ప్లేట్‌పై రూ.15 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. స్వయం సహాయక బృందాలు నిర్వహించే ఈ క్యాంటీన్లను క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.
ఇదీ చదవండి:'మీరు రోడ్డేస్తేనే.. మేము ఓటేస్తాం'