బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. నందిగ్రామ్‌లో తన కారు వద్ద కొందరు వ్యక్తులు తోసేయడం వల్లే ఇలా జరిగినట్లు ఆమె ఆరోపించారు. నందిగ్రామ్‌లోని రేయపారా ప్రాంతంలో ఓ ఆలయం బయట మమత ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.
'మమతా బెనర్జీ కాలికి గాయం- దాడే కారణం!' - బంగాల్ రాజకీయం
18:50 March 10
'మమతా బెనర్జీ కాలికి గాయం- దాడే కారణం!'
"నా కారు డోరు తెరిచి బయట నిలుచుని ఉన్నాను. ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తున్నా. కొందరు వ్యక్తులు నా కారును చుట్టుముట్టి, డోర్‌ను తోసేశారు. కారు డోర్ నా కాలుకు తగిలింది. కాలు వాచింది. గాయం కారణంగా జ్వరం వచ్చినట్లు అనిపిస్తోంది. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఈ సంఘటన జరిగినప్పుడు స్థానిక పోలీసులు ఎవరూ లేరని చెప్పారు మమత. కుట్రపూరితంగానే తనపై దాడి చేశారని ఆరోపించారు.
గత రెండు రోజులుగా పుర్బా మెదినిపుర్ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు మమత. ఈ రోజు ఉదయం నందిగ్రామ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.