తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాజ్యాంగాన్ని కాపాడడంలో దీదీ విఫలం' - భాజపా జాతీయ అధ్యక్షుడు

దేశ రాజ్యాంగాన్ని కాపాడడంలో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఘోరంగా విఫలమయ్యారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని పూర్వ బర్ధమాన్​ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.

NADDA
జేపీ నడ్డా

By

Published : Apr 16, 2021, 10:47 PM IST

Updated : Apr 17, 2021, 12:50 AM IST

చాలా ఏళ్లుగా బంగాల్​లో అధికారంలో ఉండి కూడా దేశ రాజ్యంగాన్ని కాపాడడంలో మమతా బెనర్జీ విఫలమయ్యారని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేంద్రం బలగాలను చుట్టుముట్టండి (ఘోరవ్​) అంటూ మమత పిలుపునివ్వడాన్ని సూచిస్తూ ఈ విమర్శలు చేశారు.

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని పూర్వ బర్ధమాన్​ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు నడ్డా. 'బంగాల్​లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తల్లి, భూమి, ప్రజలు అనే నినాదాన్ని మమత జపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తల్లుల(మహిళలకు) పరిస్థితి ఏమైంది? దేశంలో అత్యధికంగా మహిళలపై అత్యాచారాలు, యాసిడ్​ దాడులు, గృహహింసలు బంగాల్​లోనే జరుగుతున్నాయి' అని ఆరోపించారు.

ఇదీ చదవండి: బంగాల్:​ఈసీ అఖిలపక్ష భేటీలో భిన్న వాదనలు

Last Updated : Apr 17, 2021, 12:50 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details