తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా దూకుడు చూసి నిరాశలో మమత' - బంగాల్​లో అమిత్​ షా ప్రచారం

బంగాల్​లో ఐదు విడతల్లో జరిగిన ఎన్నికల తర్వాత.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిరాశ చెందినట్లుగా కనిపిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. 180 స్థానాలకుగాను జరిగిన ఈ పోలింగ్​లో 122 కంటే ఎక్కువ స్థానాల్లో భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

amith shah
మమతా బెనర్జీపై అమిత్​ షా విమర్శలు

By

Published : Apr 18, 2021, 3:15 PM IST

బంగాల్​లో 180 సీట్లకుగాను ఐదు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 122 కంటే ఎక్కవ సీట్లను భాజపా గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఉద్ఘాటించారు. పూర్వవర్ధమాన్​ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నందిగ్రామ్​లో ఓటమి తర్వాత టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిష్క్రమించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

"ఐదు విడతల్లో జరిగిన పోలింగ్​ తర్వాత మమతా బెనర్జీ తన ఆశలన్నీ వదులుకున్నట్లు కనిపిస్తున్నారు. 122 కంటే ఎక్కువ సీట్లలో భాజపా గెలుస్తుంది. నందిగ్రామ్​లో భాజపా అభ్యర్థి సువేందు అధికారే గెలుస్తారు."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

గొప్ప ఓటమితో మమతా బెనర్జీకి వీడ్కోలు దొరుకుతుందని అమిత్ షా విమర్శించారు. మమత పాలనలో దేశ పౌరులకు దక్కే ప్రయోజనాలను అక్రమ వలసదారులు పొందుతున్నారని ఆరోపించారు. 'బంగాల్​ ప్రజలు, నేను.. మమతా బెనర్జీకి రెండో స్థాయి వ్యక్తులం' అని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి:బంగాల్​లో రాహుల్​ ర్యాలీలు రద్దు

ఇదీ చూడండి:'చొరబాట్లను ఆపడం భాజపాతోనే సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details