రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అధికార ఎన్డీఏ పక్షాన్ని నిలువరించేందుకు బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పలు విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్ 15న దిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని కోరారు.
" 2022, జూన్ 15న మధ్యాహ్నం 3గంటలకు దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఈ భేటీకి హాజరుకావాలని మమత పిలుపునిచ్చారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతో విపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో దీదీ సమావేశమవుతారు. "
- తృణమూల్ కాంగ్రెస్.