అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరు పెంచారు బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్‌లో సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. వీల్‌చైర్‌తోనే రోడ్ షో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి భాజపా నేత సువేందు అధికారితో మమత తలపడుతున్నారు.
ఏప్రిల్ 1న జరిగే రెండో దశ పోలింగ్‌లో ప్రతిష్ఠాత్మక నందిగ్రామ్ కూడా ఉంది. దీంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు మమత. రేయపరా ఖుదిరామ్ మోరె నుంచి ఠాకూర్‌చౌక్ వరకు స్థానిక ప్రజలు, భారీ అనుచరగణంతో చక్రాల కుర్చీలోనే ఆమె రోడ్‌షోలో పాల్గొన్నారు.