ఎన్నికల కోడ్‌ను తాను అతిక్రమించలేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర బలగాలపై వ్యాఖ్యల విషయంలో ఎన్నికల సంఘం తనకిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఈసీకి సమాధానం ఇచ్చారు మమత.
కేంద్ర సాయుధ బలగాలు(సీఏపీఎఫ్) అంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ ప్రత్యేకంగా ఒక పార్టీకి ఓటు వేయాలని సీఏపీఎఫ్ సిబ్బంది.. ప్రజల్ని ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని దీదీ పేర్కొన్నారు. దీనిపై తమ పార్టీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. కొన్నింటిని మాత్రమే పరిష్కరించారని చెప్పుకొచ్చారు.
కాగా, రామ్‌నగర్‌లో ఏప్రిల్6న ఓ బాలికను సీఆర్పీఎఫ్ జవాను వేధించారని దీదీ ఆరోపించారు. అతనిపై పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు.