భాజపాను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలంటూ.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈనెల 28 నుంచి రెండు రోజుల పాటు ఆమె గోవాలో పర్యటించనున్నారు. బంగాల్ ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు దీదీ.
'అందరం కలిసి భాజపాను గద్దెదించుదాం' - గోవా వెళ్లనున్న మమతా బెనర్జీ
భాజపాను ఓడించేందుకు వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

మమతా బెనర్జీ
వచ్చే ఏడాది జరిగే గోవా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా పలువురు కాంగ్రెస్ నేతలు టీఎంసీలో చేరారు. స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గోవాంకర్ మద్దతు ప్రకటించారు. ఈనెల 28న తొలిసారి గోవాలో పర్యటించనున్నట్లు ట్వీట్ చేసిన దీదీ భాజపాను, విభజన అజెండాను ఓడించేందుకు వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లలో గోవా ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయటం ద్వారా నూతన ఆరంభానికి నాంది పలుకుదామని ట్వీట్ చేశారు.