బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. మే 5న(బుధవారం) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మే 5న మమత ప్రమాణ స్వీకారం - మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార తేదీ
బంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనుండటం.. వరుసగా ఇది ఆమెకు మూడోసారి.
మే 5న మమత ప్రమాణ స్వీకారం
ఎన్నికల పండితుల అంచనాలను తోసిరాజని.. భారీ ఆధిక్యంతో టీఎంసీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 209 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకుని సత్తాచాటింది. వంగభూమిలో తనకు తిరుగులేదని ముచ్చటగా మూడోసారి నిరూపించుకుంది.
ఇదీ చూడండి:సాయంత్రం బంగాల్ గవర్నర్తో మమత భేటీ
Last Updated : May 3, 2021, 7:05 PM IST