రాజకీయాల పట్ల కాంగ్రెస్ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో(Mamata Banerjee Goa) ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించట్లేదని దుయ్యబట్టారు.
" కాంగ్రెస్ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆ పార్టీ వల్లే మోదీజీ మరింత శక్తిమంతంగా మారుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్.. భాజపాకు టీఆర్‌పీగా మారుతోంది. ఇప్పటికైనా వారు(కాంగ్రెస్) నిర్ణయం తీసుకోకపోతే.. యావత్ దేశం బాధపడాల్సి వస్తుంది. వారికి గతంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, వారు భాజపాపై పోరాటం చేయాల్సింది మాని.. మా రాష్ట్రంలో నాపై పోటీ చేశారు. అలాంటప్పుడు మేం వారితో ఎలా చేతులు కలపగల్గుతాం"
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
కేంద్రంపై విమర్శలు