భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి నేపథ్యంలో బంగాల్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధనకర్. ఘటనపై మమత చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.
"నిన్న జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరం. అవి ప్రజాస్వామ్యానికే మచ్చ. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఆమె అగ్నితో ఆటలు ఆడకూడదు."
---- జగ్దీప్ ధనకర్, బంగాల్ గవర్నర్.