ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ బంగాల్లో మమతా బెనర్జీయే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకురాలని ''సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్'(సీఎస్డీఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య గట్టిపోటీ నెలకొన్న నేపథ్యంలో ఆయన 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. 200 స్థానాల్లో గెలుస్తామని భాజపా నాయకులు చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితి ఉండదన్నారు. గతంలోకన్నా సీట్లు పెరిగినా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాదని తెలిపారు.
'బంగాల్లో ఇప్పటికీ మమతకే ప్రజాదరణ' - మమతా బెనర్జీ న్యూస్
బంగాల్లో సీఎం మమతా బెనర్జీనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తమిళనాడు, కేరళ ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలన్నీ ఒకేలా ఉన్నా, బంగాల్ ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా మమతే మరోసారి సీఎం అవుతారని ధీమాగా చెప్పారు.
సంజయ్ కుమార్ ఇంటర్వ్యూ
2016లో కేవలం మూడు సీట్లు గెలుచుకున్న భాజపా.. ఇప్పుడు కనీసం 30 శాతం ఓట్లు(110 సీట్లు) సాధించినా అది ఘన విజయమేనని సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, మహిళలు మమతను ఆదరించారని, అదే విజయానికి కారణమవుతుందని తెలిపారు.