తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన నాయకులను కలిసిన మమతా బెనర్జీ!

Mamata Banerjee meets Shiv Sena leaders: బంగాల్ సీఎం మమతా బెనర్జీ శివసేన నాయకులు ఆదిత్య ఠాక్రే, సంజయ్​ రౌత్​లను కలిశారు. కాంగ్రెస్, టీఎంసీ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.

Mamata Banerjee meets Shiv Sena leaders
శివసేన నాయకులను కలిసిన మమతా బెనర్జీ

By

Published : Nov 30, 2021, 11:28 PM IST

Mamata Banerjee meets Shiv Sena leaders: శివసేన నాయకులు ఆదిత్య ఠాక్రే, సంజయ్​ రౌత్​లను కలిశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేను మమత బెనర్జీ కలవాల్సి ఉంది. కానీ ఆయన ఆనారోగ్యంతో ఉండటం వల్ల.. ఆదిత్య ఠాక్రేను కలిశారు. తన తండ్రి ఫొటోగ్రాఫ్​లతో కూడిన బుక్​ను మమతా బెనర్జీకి ఆదిత్య ఠాక్రే ఇచ్చారు. ఎన్​సీపీ నాయకుడు శరద్​ పవార్​ను కూడా మమత కలవనున్నారు.

మమతా బెనర్జీకి అభివాదం చేస్తున్న ఆదిత్య ఠాక్రే

అంతకు ముందురోజు సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించారు మమతా బెనర్జీ. 2008 ముంబై ఉగ్రదాడిలో పోరాడి మరణించిన పోలీసు కానిస్టేబుల్ తుకారాం ఓంబాలే స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.

ఉద్ధవ్​ ఠాక్రే ఫొటోగ్రాఫ్​లతో కూడిన బుక్​ను మమతా బెనర్జీకి ఇస్తున్న ఆదిత్య ఠాక్రే

బంగాల్​లో టీఎంసీ అజేయ విజయం సాధించాక జాతీయ రాజకీయాలపై మమతా బెనర్జీ ఎక్కువగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల మేఘాలయాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి ఫిరాయించారు. దీంతో అక్కడ టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.

ఇదీ చదవండి:'రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే.. ఆ రోజున ఆందోళన ముగింపు'

ఈడబ్ల్యూఎస్ కోటాపై సమీక్షకు త్రిసభ్య కమిటీ

ABOUT THE AUTHOR

...view details