తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'24 గంటలు కాలేదు.. అప్పుడే రాష్ట్రపతి పాలనా?

బంగాల్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు కేంద్రంపై విరుచుకుపడ్డారు. భాజపాకు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట్లే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించిన మమతా.. కేంద్రమంత్రులు రాష్ట్రంలో హింసకు ఉసిగొల్పుతున్నారన్ని మండిపడ్డారు.

mamata
మమతా

By

Published : May 7, 2021, 10:35 AM IST

బంగాల్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలతో పాటు, సంయుక్త మోర్చాకు చెందిన ఒకరు ఉన్నారని చెప్పారు. పోలింగ్‌ సమయంలో కూచ్‌బెహార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో మరణించిన ఐదుగురికి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున హోంగార్డు ఉద్యోగం ఇస్తామని మమత ప్రకటించారు. అలాగే కాల్పుల ఘటనపై సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించిందని, నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పారు.

ఈ సందర్భంగా భాజపాపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హింసకు కేంద్రమంత్రులు ఉసిగొల్పుతున్నారంటూ మమత వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చి ఇంకా 24 గంటలకు కాకముందే లేఖలు, కేంద్ర బృందాలు రాక వంటివి జరిగిపోతున్నాయని అన్నారు. ముందు ఆ పార్టీ నేతలు ప్రజల తీర్పును స్వాగతించడం నేర్చుకోవాలని సూచించారు. భాజపాకు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట్లే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కొవిడ్‌పై దృష్టి సారించాలనుకుంటున్నామని, తమను పనిచేసుకోనివ్వాలని మమత అన్నారు. జగడాల జోలికి వెళ్లాలనుకోవట్లేదని చెప్పారు.

బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రులు, పలువురు నేతలు డిమాండ్​ చేస్తున్నారు. బంగాల్​లో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు దారి తీసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ పైవిధంగా తీవ్రంగా స్పందించారు.

ఇవీ చదవండి:'బంగాల్​లో హింసపై నివేదిక పంపరేం?'

ABOUT THE AUTHOR

...view details