బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 16 మంది చనిపోయినట్లు వెల్లడించారు సీఎం మమతా బెనర్జీ. ఈ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు దీదీ ప్రకటించారు. అలాగే కూచ్‌బిహార్ ఘర్షణలో చనిపోయినవారి కుటుంబాలకు హోం గార్డు ఉద్యోగాలిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభించిందని తెలిపారు.
"ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 16 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది భాజపా, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందినవారే. మరొకరు సంయుక్త మోర్చాకు చెందినవారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తాం. సీతల్‌కుచి బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున హోంగార్డు ఉద్యోగాలిస్తాం."
- సీఎం మమతా బెనర్జీ