Suspension of Rajya Sabha Members: రాజ్యసభలో ఏర్పడిన ప్రతిష్టంభణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్ధమని.. ఇది అప్రజాస్వామ్యమని ఆరోపించారు. సస్పెండైన ఎంపీలకు మద్దతుగా తాము నిరసన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
"ప్రభుత్వ వైఖరిపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎంపీలపై చర్యలు చేపట్టే ముందు ప్రతీ ఎంపీ పేరు ప్రస్తావించి వారిపై వేటు వేయడానికి గల కారణాలను తెలియజేయాలి. గత సమావేశాలకు సంబంధించి ఎంపీలను ఇప్పుడు సస్పెండ్ చేసే హక్కు కేంద్రానికి లేదు. ఈ చర్య రాజ్యాంగంలో కూడా లేదు."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత