తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సిన్​ నకిలీ యాప్​- లింకు తెరిస్తే అంతే!

కొవిడ్ వ్యాక్సిన్​కు సంబంధించి ఆండ్రాయిడ్ సాఫ్ట్​వేర్​ ఆధారంగా పనిచేసే స్మార్ట్​ఫోన్లకు నకిలీ మెసేజ్​లు వస్తున్నాయని నిఘా అధికారులు గుర్తించారు. వాటి ద్వారా ఫోన్లలోని డేటాను సైబర్​ నేరగాళ్లు కాజేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంక్షిప్త సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు.

Cyber attacks
వ్యాక్సిన్​ నకిలీ యాప్

By

Published : May 11, 2021, 6:31 AM IST

Updated : May 11, 2021, 7:03 AM IST

"కొవిడ్ వ్యాక్సిన్ పొందడం కోసం ఈ యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోండి. ఇందుకు ఈ లింకు క్లిక్ చేయండి" అంటూ ఫోన్లకు నకిలీ మెసేజ్​లు వస్తున్నాయి. తద్వారా దుండగులు ఆయా ఫోన్లలోకి చొరబడి వాటిలో ఉన్న ఫోన్ నంబర్లను, డేటాను కాజేస్తున్నట్టు సైబర్ నిఘా అధికారులు గుర్తించారు. ఇలాంటి సంక్షిప్త సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని 'ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్)' ప్రజలను హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా సూచనలు జారీచేసింది.

"కొవిడ్ వ్యాక్సిన్​కు సంబంధించి ఆండ్రాయిడ్ సాఫ్ట్​వేర్​ ఆధారంగా పనిచేనే స్మార్ట్​ఫోన్లకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. వీటిలోని లింకును ఓపెన్ చేశాక.. యాప్ అనవసర అనుమతులన్నీ అడుగుతోంది. తద్వారా ఫోన్​లోని కాంటాక్టు లిస్టు, ఇతర సమాచారాన్ని తస్కరించేందుకు వీలవుతోంది. Covid19.apk, vaci_Regis.apk, MyVaccin_v2.apk, Cov-Regis.apk, Vaccin-Apply.apk వంటి పేర్లతో ఈ నకిలీ యాప్ ఫైళ్లు ఉంటున్నాయి. వ్యాక్సిన్ విషయంలో ఇలాంటి సందేశాలు, ఈమెయిళ్లు, యాప్​లను నమ్మొద్దు."

-సెర్ట్​

కరోనా వ్యాక్సిన్ కోసం http://cowin.gov.in పేరున ఉన్న అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలని సెర్ట్​ తెలిపింది. ఫోన్ సెట్టింగ్స్ లోని "అన్​ట్రస్టెడ్ సోర్సెస్" ఆప్షన్‌ను మార్చుకోవడం, నమ్మకమైన యాంటీ-వైరస్, ఇంటర్నెట్ ఫైర్ వాల్ టూలు వాడటం ద్వారా నకిలీ యాప్స్ బెడద నుంచి తప్పించుకోవచ్చు అని సూచించింది.

ఇదీ చూడండి:ఝార్ఖండ్​లో ఈనెల 14 నుంచి 18 ప్లస్​కి ఉచిత టీకా

ఇదీ చూడండి:'సెంట్రల్​ విస్టా వ్యయంతో 62 కోట్ల టీకా డోసులు'

Last Updated : May 11, 2021, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details