తెలంగాణ

telangana

కాంగ్రెస్​కు 'మహా' షాక్- మిత్రపక్షంలోకి మేయర్​ సహా 28 మంది కార్పొరేటర్లు

Malegaon Congress Party: మహారాష్ట్ర, మాలేగావ్​లో కాంగ్రెస్​కు భారీ షాక్ తగిలింది. మాలేగావ్ మేయర్​ సహా 28 మంది మున్సిపల్​ కార్పొరేటర్లు ఎన్​సీపీలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్​సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

By

Published : Jan 28, 2022, 9:37 AM IST

Published : Jan 28, 2022, 9:37 AM IST

Malegaon Congress
మాలేగావ్​లో కాంగ్రెస్​కు భారీ షాక్

Malegaon Congress Party: మహారాష్ట్రలోని మాలేగావ్​లో కాంగ్రెస్​కు కోలుకోలేని షాక్ తగిలింది. మాలేగావ్​ మున్సిపల్ కార్పొరేషన్​కు చెందిన​ 28 మంది కార్పొరేటర్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో(ఎన్​సీపీ)చేరారు. వీరితో పాటు మాలేగావ్ మేయర్​ తహీరా షేక్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో ఎన్​సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎన్​సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.

ఎన్​సీపీ నాయకుల సమక్షంలో కార్పొరేటర్లు

"సంకీర్ణ కూటమితో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ పార్టీని విస్తరించుకునే హక్కు మాకు ఉంది. అందువల్ల ఎవరైనా ఎన్​సీపీలోకి వస్తే స్వాగతిస్తాం. మాలేగావ్​లోని 28 మంది పార్టీ నాయకుల్లో 27 మంది ఎన్​సీపీలో చేరారు."

-- అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

ముంబయిలోని మలాద్ స్టేడియానికి టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని సూచించినా భాజపా పట్టించుకోలేదని అన్నారు పవార్. టిప్పు సుల్తాన్​ను హిందు వ్యతిరేకవాదిగా భాజపా చూస్తోందని, అయితే ఇందులో నిజం లేదని తెలిపారు.

28 మంది కార్పొరేటర్లు ఎన్​సీపీలోకి

మొత్తం 84 మంది మున్సిపల్ కార్పొరేటర్లలో ఇప్పటికే 20 మంది ఎన్​సీపీ పార్టీకి చెందినవారు కాగా.. మిగిలినవారు శివసేన(18), భాజపా(9), ఏఐఎంఐఎం(7), జేడీఎస్​(6) సభ్యులు.

ఇదీ చూడండి:'మా నాన్నను గెలిపించండి'.. ఎన్నికల ప్రచారంలో ఏడేళ్ల బాలిక

ABOUT THE AUTHOR

...view details