కేరళలో ఓనమ్ పండుగను(Onam 2021) ఘనంగా జరుపుకొంటున్నారు మలయాళీలు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. చిన్నాపెద్ద అంతా సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోయంబత్తూర్లోని శ్రీ అయ్యప్ప ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. అయితే.. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో గుడిలోపలికి ఎవరినీ అనుమతించలేదు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
ఓనమ్ పండుగను(Onam Festival) పురస్కరించుకుని మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'ఈ పండుగ సానుకూలత, చైతన్యం, సోదరభావం, సామరస్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా' అని మోదీ ట్వీట్ చేశారు.
'ప్రజలందరికీ ఓనమ్ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ కొత్త పంటల వేడుక. రైతుల నిర్వరామ కృషికి నిదర్శనం. మాతృభూమి స్వభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప సందర్భం. ప్రజలందరూ సంతోషం, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి.' అని ట్వీట్ చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
శశిథరూర్ ఇంట్లో ఓనమ్..