తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే! - కర్ణాటకలో ప్లాస్టిక్ టైల్స్ తయారీ

Making Tiles With Plastic In Mysuru : ప్రస్తుతం ప్రపంచానికి సవాల్​గా మారుతున్న సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. అయితే కర్ణాటకలో ఒక్కసారి వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లతో టైల్స్​ను తయారు చేస్తున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఎలా టైల్స్ ఎలా చేస్తుందో తెలుసుకుందాం.

Making Tiles With Plastic In Mysuru
Making Tiles With Plastic In Mysuru

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 2:58 PM IST

Updated : Dec 7, 2023, 3:53 PM IST

ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే!

Making Tiles With Plastic In Mysuru: ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు కంపెనీ ముందుకు వచ్చింది. మైసూరు మున్సిపల్ కార్పొరేషన్​ సాయంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేసి పర్యావరణ హిత టైల్స్​ను తయారు చేస్తోంది. 'సీ వేజ్' పేరుతో జాగృత్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మున్సిపల్ కార్పొరేషన్​ సాయంతో మైసూరులోని విద్యారణ్యపురంలో పరిశ్రమను ప్రారంభించింది. మున్సిపల్ కార్పొరేషన్​ సేకరించిన చెత్తలో నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను కంపెనీకి తీసుకొస్తోంది. వాటి నుంచి నాణ్యమైన టైల్స్​ను రూపొందిస్తోంది.

ప్లాస్టిక్ టైల్స్

"ప్రస్తుతం ప్లాస్టిక్ పెద్ద సమస్యగా మారింది. వాటర్ బాటిళ్లు లాంటివి కొన్ని ప్లాస్టిక్ వస్తువులను రీసైకిల్ చేస్తున్నారు. అయితే చిప్స్, చాకెట్లు, బిస్కెట్ లాంటి మల్టీ లేయర్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ కవర్లే సమస్యగా మారాయి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్లను రీసైకిల్ చేసే టెక్నాలజీని మేము కనుగొన్నాం. పేటెంట్ రైట్స్​ కూడా తీసుకున్నాం. కార్పొరేషన్ మాకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తుంది. దానితో మేము ప్లాస్టిక్ టైల్స్ తయారు చేస్తున్నాం"

- దర్శన్, జాగృత్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్

ముందుగా కార్పొరేషన్​ నుంచి సేకరించిన ప్లాస్టిక్ కవర్లను మెషిన్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. వాటిని వేడి చేసి కరిగించి ఒక ముద్దలాగా మారుస్తారు. ఆ తర్వాత అచ్చు యంత్రంలో పెట్టి టైల్స్​గా తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ టైల్స్ సిమెంట్ టైల్స్​తో పోలిస్తే తక్కువ ధర అని, బరువు కూడా తక్కువేనని జాగృత్ టెక్ డైరెక్టర్ చెబుతున్నారు.

ప్లాస్టిక్​ కవర్లను మెషిన్​ సాయంతో చేసిన చిన్న ముక్కలు

"ఈ టైల్స్ 500 ఏళ్ల వరకు మన్నిక కలిగి ఉంటాయి. అదే సిమెంట్ టైల్స్ 20 సంవత్సరాలకు మించి ఉండవు. ప్లాస్టిక్ టైల్స్​ను ఎన్నిసార్లు అయినా తీసి మళ్లీ అమర్చుకోవచ్చు. ఒకవేళ టైల్స్ డిజైన్ నచ్చకపోతే 50 సంవత్సరాల లోపు ఎప్పుడైనా వచ్చి అదే కంపెనీకి తిరిగి ఇవ్వచ్చు. వాటిని కొత్త డిజైన్​తో మళ్లీ టైల్స్​ను తయారు చేస్తాం."

- దినేశ్, జాగృత్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్

టైల్స్​ను తయారు చేయడానికి ప్రతిరోజూ రెండు టన్నుల ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారని కంపెనీ డైరెక్టర్ దినేశ్ తెలిపారు. ప్లాస్టిక్ సమస్యకు ఇది మంచి పరిష్కరమని.. ప్రభుత్వం దీనిని అన్ని ప్రాంతాల్లోనూ ప్రారంభించాలని జాగృత్ డైరెక్టర్ అంటున్నారు.

అచ్చు యంత్రం నుంచి బయటకు తీస్తున్న టైల్స్
ప్లాస్టిక్​ టైల్స్ కోసం సేకరించిన సింగిల్ యూజ్ కవర్లు

ప్లాస్టిక్​ బాటిళ్లతో సింథటిక్ నూలు ఉత్పత్తి, విదేశాలకు ఎగుమతి, తక్కువ ఖర్చుతో తయారీ

Man Created Garden Using Plastic Waste : ప్లాస్టిక్ వ్యర్థాల్లో అందమైన తోట.. కనువిందు చేస్తున్న 'ఈడెన్ గార్డెన్'

Last Updated : Dec 7, 2023, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details