తెలంగాణ

telangana

ETV Bharat / bharat

NTR Idols in Tenali: ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు.. తెనాలి టు విదేశాలకు అన్నగారి విగ్రహాలు - ఎన్టీఆర్​ విగ్రహాల తయారీ

NTR Statues Making in Tenali: NTR శతజయంతి ఉత్సవాల వేళ విదేశాల్లోని తెలుగువారు ఆ మహనీయుడిని ఘనంగా స్మరించుంటున్నారు. ఖండాంతరాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ఎక్కడిక‌క్కడ ఎన్టీఆర్ విగ్రహలు పెట్టి.. వేడుకలు నిర్వహిస్తున్నారు. అభిమానుల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిన ఆ మహానేత విగ్రహాలు.. తెనాలి సూర్యశిల్పశాల నుంచి అమెరికా సహా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ntr statues
ntr statues

By

Published : May 13, 2023, 8:11 AM IST

ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాలు

NTR Statues Making in Tenali: ఎన్టీఆర్....! సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిన మహోన్నత వ్యక్తి. రాష్ట్రం, దేశమనే కాకుండా ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సదా స్మరించుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ శతజయంతి వేళ దేశ, విదేశాల్లో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నాయకుడికి విగ్రహలు ఏర్పాటు చేసి శతజయంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన ఎన్టీఆర్‌ విగ్రహలను గుంటూరు జిల్లా తెనాలి సూర్య శిల్పశాల నుంచి ఆర్డర్‌ ఇచ్చి తీసుకెళ్లుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 50పైగా విగ్రహలను వివిధ దేశాలకు పంపించినట్లు నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు.

"ఎన్టీఆర్​ శత జయంతి ఉత్సవాల సందర్భంగా, అలాగే వివిధ దేశాల్లో ప్రతిష్ఠించేందుకు ఎన్టీఆర్​ విగ్రహాలు తయారు చేయడానికి పెద్దఎత్తున ఆర్డర్లు వచ్చాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ దేశాల నుంచి ఆర్డర్​ రావడంతో వాటిని తయారు చేసి అక్కడికి ట్రాన్స్​ఫోర్ట్​ చేస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాలలో తయారైన విగ్రహాలు సజీవంగా ఉన్నాయనే పేరు రావడంతో ఎంతో మంది ఇతర దేశాల నుంచి విగ్రహాల కోసం ముందుకు వస్తున్నారు"-కాటూరి వెంకటేశ్వరరావు, సూర్య శిల్పశాల నిర్వాహకులు

మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయన్న నిర్వాహకులు... బస్ట్ సైజ్ విగ్రహలకు డిమాండ్ ఉందని తెలిపారు. ముఖ కవళికలు ప్రస్ఫుటంగా ఉండి జీవకళ ఉండేలా విగ్రహల తయారీలో శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. అందుకే ఎగుమతి ఖర్చులు ఎక్కువైనా...విదేశాల్లోని తెలుగువారు ఈ విగ్రహలే కావాలంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు.. కాంస్యం, పైబర్‌తో పాటు భారీ మెటల్ విగ్రహల తయారీలోనూ ప్రత్యేక చాటుకుంటున్న సూర్య శిల్పశాల నిర్వాహకులు.. తమ ప్రతిభకు ఖండాంతరాల్లోనూ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"ఇతర దేశాలకు విగ్రహాలు పంపాలంటే మరికొంచెం శ్రద్ధ తీసుకొని వాటిని తయారు చేస్తాము. ఎన్టీఆర్​ రూపురేఖలు, పెయింటింగ్​లో క్వాలిటీ, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని తయారు చేస్తున్నాం. ఇతర దేశాలకు కేవలం బస్సు సైజ్​ విగ్రహాలనే పంపిస్తాం. ఎందుకంటే ట్రాన్స్​ఫోర్ట్​ ఛార్జీలు ఎక్కువ అవుతాయి. విగ్రహం తయారీ కంటే కూడా రవాణాకే ఎక్కువ ఖర్చు అవుతోంది. పెద్ద సైజ్​ విగ్రహాలు అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేరే దేశాలకు పంపించాలంటే ఖర్చు అలాగే విమానంలో తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్లు బస్సు సైజ్​ విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు"-కాటూరి వెంకటేశ్వరరావు, సూర్య శిల్పశాల నిర్వాహకులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details