తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా ఫ్రీ' గ్రామం.. రూ.50 లక్షల పురస్కారం - మహారాష్ట్ర కరోనా మరణాలు

కరోనా రెండోదశలో మారుమూల ప్రాంతాలు సైతం వణికిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి మహమ్మారిని దరిచేరనీయకుండా.. అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

Make your village 'corona free', win Rs 50 lakh: Maha govt
'కరోనా ఫ్రీ' గ్రామం.. రూ.50 లక్షల బహుమానం

By

Published : Jun 2, 2021, 8:42 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం 'కరోనా ఫ్రీ విలేజ్' పేరిట వినూత్న పోటీకి శ్రీకారం చుట్టింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు గ్రామాలు చేసిన కృషిని ప్రశంసించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. 'మై విలేజ్ కరోనా ఫ్రీ' అనే కార్యక్రమాన్ని ప్రకటించినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఏంటీ పోటీ..?

'కరోనా ఫ్రీ విలేజ్'లో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్ ​నుంచి మూడు గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తారు. మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన గ్రామాలకు వరుసగా రూ.50 లక్షలు, రూ.25 లక్షలు, రూ.15 లక్షలను అందిస్తారు. రాష్ట్రంలో మొత్తం ఆరు రెవెన్యూ డివిజన్లున్నాయని.. మొత్తం 18 గ్రామాలకు రూ.5.4 కోట్ల ప్రైజ్ మనీ అందిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ తెలిపారు.

అంతేగాక బహుమతి విలువకు సమానమైన అదనపు మొత్తం ప్రోత్సాహంగా లభిస్తుందని.. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు.

పోటీలో పాల్గొనే గ్రామాలను 22 ప్రమాణాలను అనుసరించి ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి చెప్పారు.

ఇవీ చదవండి:'టీకాలు లేవు.. వ్యాక్సినేషన్​​ చేపట్టలేం'

టీకా తీసుకోండి రూ.840 కోట్లు గెలుచుకోండి!​

ABOUT THE AUTHOR

...view details