తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కులలో చేర్చాలి'

మైరుగైన ఆరోగ్యం పొందడం ప్రాథమిక హక్కులలో చేర్చాలని నోబెల్​ అవార్డు గ్రహీత కైలాశ్​ సత్యర్థి..కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్నారుల విద్య, ఆరోగ్య అవసరాల కోసం నిధుల్ని సమకూర్చాలని విన్నవించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు, పౌర సమాజం ఒక టీం ఇండియాగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

health fundamental right,
ఆరోగ్యం

By

Published : Jun 11, 2021, 9:46 PM IST

'ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కులలో చేర్చలని కేంద్ర ప్రభుత్వానికి నోబెల్​ అవార్డు గ్రహీత కైలాశ్​ సత్యర్థి విన్నవించారు. చిన్నారుల విద్య, ఆరోగ్య అవసరాల కోసం నిధుల్ని సమకూర్చాలని కోరారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఎంతో ముఖ్యమని తెలిపారు.

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం(జూన్​ 12) సందర్భంగా బచ్​పన్​ బచావో ఆందోళన్​ స్వచ్ఛంద సంస్థ, కైలాశ్​ సత్యర్థి చిల్డ్రన్​ ఫౌండేషన్​ కలిసి.."కరోనా సమయంలో ఏర్పడ్డ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన'పై సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

'టీం ఇండియాగా పని చేయాలి'

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు, పౌర సమాజం ఒక టీం ఇండియాగా కలిసి పనిచేయాలని కైలాశ్​ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:కరోనా దెబ్బతో కార్మికులుగా మారుతున్న పిల్లలు

"మన పిల్లలను వదిలి.. దేశ అభివృద్ధి గురించి ఎలా ఆలోచించగలం? అది మానవత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. నాలుగు సంవత్సరాల నుంచి బాల కార్మికల సంఖ్య పెరిగింది. కరోనా మహమ్మారి మరింత మంది పిల్లల్ని కార్మికులుగా మార్చింది."

-కైలాశ్​ సత్యర్థి, నోబెల్​ అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త

"ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలి. మన కార్యాచరణలో మొదటిది పిల్లలకు విద్యాహక్కు అమలయ్యేలా చూడడం, పేదరిక నిర్మూలన, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చేయడం రెండు, మూడో లక్ష్యాలైతే..నాల్గవ లక్ష్యం ఆరోగ్యం. ఇవి మనకు చాలా ముఖ్యమైన పనులు" అని అన్నారు.

కైలాశ్​ వ్యాఖ్యలపై కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్​ గంగ్వార్​ స్పందించారు.

"కార్మిక మంత్రిగా, పిల్లలందరికీ న్యాయం దక్కేలా , అలాగే వారు వారి హక్కులను పొందేలా చూస్తాం. కరోన సమయం చాలా మంది బాలల్ని కార్మికులుగా మార్చుతున్నందున పిల్లల రక్షణకు తాము తగ్గినన్ని చర్యలు తీసుకుంటాం."

-సంతోష్​ గంగ్వార్​, కార్మిక శాఖ సహాయ మంత్రి

"బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రభుత్వ ముఖ్యలక్ష్యాలలో ప్రధానమైనది. అందుకోసం కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమైన చర్యలు తీసుకున్నాము. కరోనా బారిన పడిన పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ అందిచ్చేవిషయమై ప్రభుత్వం సీరియస్​గా ప్రణాళికలను రూపొందిచాలి. పిల్లల హక్కుల విషయమై కైలాశ్​ సత్యర్థి ఆయన ఫౌండేషన్​ అందించిన సూచనలను చిన్నారుల భవిష్యత్​ కోసం తప్పక పరిశీలిస్తాను." అని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి:మానవ అక్రమ రవాణా కేసులో 38 మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details