సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల నిరసన జరుగుతున్న మాదిరిగానే కర్ణాటకలోనూ రైతులు ఆందోళన చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. బెంగళూరును అన్నివైపుల నుంచి ముట్టడించాలని కోరారు. శివమొగ్గలోని రైతుల సభకు హాజరైన టికాయిత్.. రైతు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్నారు.
"దిల్లీలో లక్షల మంది నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. సాగు చట్టాల రద్దు జరిగే వరకూ అన్ని రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టాలి. కర్ణాటకలోనూ రైతులు నిరసనకు సిద్ధమవ్వండి. మీ భూమిని లాగేసుకునేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కొత్త చట్టాలతో వ్యవసాయం కార్పొరేట్ గుప్పిట్లేనే ఉండబోతోంది."