Makar Sankranti Sun Transit In Capricorn In 15th January 2024 :సహస్ర కిరణుడైన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే మహత్తర పుణ్య దినమే మకర సంక్రాంతి. ఈ శుభ సమయాన మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి మకర సంక్రాంతి తరువాత కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
పరిహారం - శివునికి జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.
వృషభం (Taurus) :సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత వృషభ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే విజయం అంత తేలికగా రాదు. బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
పరిహారం – ప్రతిరోజూ సూర్య భగవానుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించాలి.
మిథునం (Gemini) :సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీ ప్రయాణాలు సులువుగా జరుగుతాయి. కానీ మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయటి ఆహార, పానీయాలకు దూరంగా ఉండడం మంచిది.
పరిహారం - సూర్య భగవానుని పవిత్ర మంత్రాలను జపించాలి.
కర్కాటకం (Cancer) : సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత కర్కాటక రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అధికం అయ్యే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు.
పరిహారం - ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.
సింహం (Leo) :సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత సింహ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ శత్రువు పక్షం బలహీనం అవుతుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ వ్యయాలను అదుపు చేయడం కష్టమవుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం మారడానికి ఆసక్తి చూపిస్తారు.
పరిహారం - రోజూ సూర్య నమస్కారాలు చేయాలి.
కన్య (Virgo) :సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత కన్య రాశివారికి ఒక నెల వరకు మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీ పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు.