Makar Sankranti 2024 Wishes in Telugu :తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి షురూ అయింది. పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ పుణ్యదినాన్నే సంక్రాంతిగా జరుపుకుంటారు తెలుగువారు. పంట చేతి కొచ్చే సమయంలో, ఆనందోత్సవాల నడుమ మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ.. రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఢమరుక నాదాలు, జంగమదేవరల జేగంటలు, పిట్టలదొరల బడాయి మాటలతో సరదాగా సాగిపోతుంది.
ఈ పండగను తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బంగాల్, గోవా, అస్సాం వంటి రాష్ట్రాల్లో హిందువులు, సిక్కులు ప్రముఖంగా జరుపుకుంటారు. అయితే తెలుగు లోగిళ్లలో మకర సంక్రాంతి(Sankranti 2024) సంబరం అంబరాన్ని అంటుతోంది. మరి మీరు కూడా ఈ పండగ సంతోషాన్ని మీ ఆత్మీయులు, కుంటుంబ సభ్యులతో పంచుకోవాలనుంటున్నారా? అయితే మీకోసం "ఈటీవీ భారత్" అదిరిపోయే సంక్రాంతి సందేశాలు, స్పెషల్ కోట్స్ పట్టుకొచ్చింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి మీ బంధుమిత్రులకు ఇలా విషెస్ చెప్పి వారు మరింత ఆనందపడేలా చేయండి.
Makar Sankranti Special Wishes 2024 :
- 'భోగ భాగ్యాలనిచ్చే భోగి.. సరదాలనిచ్చే సంక్రాంతి.. కమ్మని కనుమ.. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!'
- 'ఈ పండగ మీ జీవితంలో కొత్త ఆరంభాలు, శుభాలను తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, బంధుమిత్రులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు'
- 'మీ జీవితంలో ఈ సంక్రాంతి సరికొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు పొంగల్ శుభాకాంక్షలు!'
- 'సూర్యుని ఈ కొత్త ప్రయాణం మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు!'
- 'ఈ సంక్రాంతి మీకు ఎన్నో ఆనంద అనుభూతులను మిగల్చాలని మనసారా కోరూకుంటూ.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు'
- 'ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం.. జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం.. మీకు, మీ ప్రియమైన వారికి హ్యాపీ సంక్రాంతి!!'
- 'ఉదయించే సూర్యునితో.. మీ జీవితంలోని మంచి క్షణాలు, విజయాలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ.. మీకు, మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు!'
- 'మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషం.. జీవితకాలం ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ పొంగల్!'
- 'ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాల మాదిరిగానే.. మీరు ఎల్లప్పుడూ ఎత్తుకు ఎగరాలని ఆశిస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు'
భోగి పండగ వేళ వాట్సాప్ స్టేటస్‌గా ఈ కోట్స్ ట్రై చేయండి - సూపర్ అనాల్సిందే!
Makar Sankranti Special Quotes in Telugu :
"భోగిపండ్లుగా మారే రేగిపండ్లు..
రంగువల్లుల మధ్య గొబ్బిళ్లు..
ముద్దుల చిన్నారుల చిరునవ్వులు..
ఎక్కడ ఉన్నా మరవలేనివి మన పండుగలు.." -అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!!
"తెలుగుదనాన్ని చాటుతూ..
సంప్రదాయాల్ని తెలుపుతూ..
సంక్రాంతి సంబరాన్ని జరుపుకో..
తెలుగు వారసత్వాన్ని నిలుపుకో.." -మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
''గుర్తొచ్చాయా చిన్ననాటి సంగతులు..
వణికే చలిలో భోగి మంటలు..
కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు..
మదిలో మెదిలో మధుర స్మృతులు.."- అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!