కేరళ ఎర్నాకుళం జిల్లా ఎలూరు నగరంలోని ఐశ్వర్య బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగల దుకాణానికి ఆనుకొని ఉన్న సెలూన్ షాపుకు కన్నం వేసి దుండగులు బంగారం షాపులోకి ప్రవేశించారు. మూడు కిలోల బంగారం, 25కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. షాపు యజమాని సోమవారం ఉదయం దుకాణం తెరవటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సెలూన్‌కు కన్నం వేసి నగల దుకాణంలో చోరీ - కేరళలోని ఓ నగల దుకాణం చోరీ
కేరళలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. 3కిలోల బంగారం, 25కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు దుండగులు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సెలూన్‌కు కన్నం వేసి.. నగల దుకాణంలో చోరీ
యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులతో పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. దుకాణంలోకి సీసీ కెమెరాలు సైతం పనిచేయటంలేదని యజమాని తెలిపారు.
Last Updated : Nov 16, 2020, 8:14 PM IST